రాష్ట్ర రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారన్న ప్రచారంపై ఏపీలో దుమారం రేగుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే.. మరోవైపు రైతుల్లో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. మంత్రి బొత్స చేసిన ప్రకటనను రాజధాని రైతులు ఖండిస్తున్నారు. రాజధానిపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు.