ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నలుగురు యువకులు తుళ్లూరులో సెల్ టవర్ ఎక్కారు. స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాలంటూ ప్రచారం చేస్తున్నారని వారు ఆరోపించారు. 32 రోజులుగా అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తున్నా కనీసం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.