ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మీద దాడి జరిగింది. లోక్‌సభ ఎన్నికల కోసం మోతీ నగర్ ప్రాంతంలో ఆయన రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో ఓ యువకుడు అరవింద్ కేజ్రీవాల్ చెంపపై కొట్టాడు. ఆ యువకుడు ఎవరు? ఎందుకు కొట్టాడనేది తెలియలేదు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.