హోమ్ » వీడియోలు

Video: వరకట్న వేధింపుల కేసు పెట్టిన భార్య... తట్టుకోలేక భర్త ఆత్మహత్య...

క్రైమ్12:54 PM IST Jan 04, 2019

పదేళ్లుగా హైదరాబాద్ సెంట్రల్ మాల్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రభు... నల్లకుంటలో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రాణి... ఇద్దరు కొన్నాళ్ల క్రితం ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో వాళ్లను ఎదురించి పెళ్లిచేసుకున్నారు. వీరికి వినోద్ అని ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే బాబు పుట్టిన తర్వాత ప్రభు, రాణిల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. నిత్యం ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో విడాకులు తీసుకునేందుకు దరఖాస్తు కూడా చేసుకున్నారు. కొడుకు వినోద్, తండ్రి ప్రభు సంరక్షణలోనే ఉంటున్నాడు. అయితే ప్రభు మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న రాణి... అతనిపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. తనపై వరకట్న వేధింపుల కేసు నమోదుకావడం అవమానంగా భావించిన ప్రభు... గురువారం కొడుకు వినోద్‌ను నిద్ర బుచ్చి, పడుకోబెట్టాడు. తర్వాత ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... రాణి, భర్త మీద తప్పుడు కేసు పెట్టిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Chinthakindhi.Ramu