మన చుట్టూ రకరకాల వ్యక్తులుంటారు. ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన టాలెంట్ ఉంటుంది. పుణెకి చెందిన ఈ కుర్రాడు అలాంటి వాడే. బియ్యం గింజలపై అక్షరాలు రాస్తూ... స్వయంగా ఉపాధి పొందుతున్నాడు. రామ్, రహీం, ప్రభువు, ఎవరు ఏ లెటర్స్ కావాలంటే వాటిని బాస్మతీ బియ్యం గింజలపై రాస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇతన్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో... చాలా మంది ఇలా బియ్యం గింజలపై తమకు కావాల్సిన పేర్లు రాయించుకుంటున్నారు.