రాజస్థాన్‌లో జరిగిందీ ఘటన. రెండ్రోజుల కిందట రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా పోలీసులు కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐతే... ఓ కారు డ్రైవర్... బ్లాక్ చేసిన రోడ్డులో వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితిని అర్థం చేసుకోని ఆ కారు డ్రైవర్... ASI మోహన్ సింగ్‌పై దాడికి దిగాడు. చుట్టూ పది మంది దాకా పోలీసులు అతన్ని అడ్డుకుంటున్నా... వెనక్కి తగ్గలేదు. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు అతన్ని రాజ్ పాల్ దయాల్‌గా గుర్తించారు. అతనిపై పై అధికారులకు రిపోర్ట్ ఇచ్చారు.