హోమ్ » వీడియోలు » జాతీయం

ఓటు ఎవరికి వేసారో..వారినే అడగండి : కర్నాటక ముఖ్యమంత్రి కుమార స్వామి

జాతీయం17:56 PM June 26, 2019

కర్నాటక సీఎం కుమారస్వామి గ్రామ బస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని కరేగుడ్డ అనే గ్రామానికి సీఎం కుమారస్వామి ఓ బస్సులో వెళ్తున్నారు. మార్గమధ్యంలో రాయచూర్ వద్ద నిరసనకారులు ఆ బస్సును ఆపి.. ఎర్మారస్ ధర్మల్ పవర్ స్టేషన్‌‌లో పనిచేస్తున్న కార్మికులు తమ వేతనాలు, ఇతర సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేయసాగారు. అందులో భాగంగా.. అటుగా వెళ్తున్న ముఖ్యమంత్రి కుమారస్వామిని అడ్డుకున్నారు. ‘సిగ్గు.. సిగ్గు..’ అంటూ నినాదాలు చేశారు. దీంతో కుమారస్వామికి కోపం వచ్చింది. దీంతో ఆయన బస్సు కిటికీ అద్దం తెరిచి నిరసనకారుల మీద అరిచారు. ‘ఓటు లేదు. జాబ్స్ లేవు. నరేంద్ర మోదీకి ఓటేశారుగా. వెళ్లి ఉద్యోగాలు కూడా ఆయన్నే అడగండి.’ అంటూ కసురుకున్నారు.

webtech_news18