లైఫ్లైన్ ఎక్స్ప్రెస్, ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రైన్ హస్పిటల్. ఈ ట్రైన్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలకు తిరుగుతూ..ఆయా రాష్ట్రాల్లోని ప్రముఖ పట్టణాలో ఆగుతుంది. ప్రస్తుతం ఈ రైలు ఈశాన్య రాష్ట్రాలో ఒకటైన త్రిపుర రాష్ట్రానికి చేరింది. అక్కడే కొన్ని రోజుల పాటు ఉండి వైద్య సేవలను అందించనుంది. రోగులకు అవసరమైన శస్త్రచికిత్సలు చేయడానకిి రైలులోనే అత్యాధునిక పరికరాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం వుంటుంది. ఈ రైలు దవాఖానలో ఆర్థో, క్యాటరాక్ట్ మొదలగు సమస్యలకు వైద్యం అందిస్తారు.