హోమ్ » వీడియోలు » జాతీయం

Video : తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ టెన్షన్... పెరుగుతున్న పుకార్లు...

జాతీయం09:56 AM January 24, 2020

కరోనా... కరోనా... కరోనా... ఒకప్పుడు సార్స్, మెర్స్ లాగా... ఇప్పుడీ కొత్త వ్యాధిపై ప్రజలు, ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయి. ఎందుకంటే... ఆ వ్యాధి అలా భయపెడుతోంది మరి. చైనాలో మొదలై, జపాన్, అమెరికా, సౌదీ అరేబియా (ఓ కేరళ మహిళకు వచ్చింది) ఇలా కొన్ని దేశాల్లో ఈ వ్యాధి సోకిన కేసులు బయటపడుతుంటే... ప్రపంచ దేశాలు టెన్షన్ పడుతున్నాయి. పైకి మనకు కరోనా ఎఫెక్ట్ ఉండదు అని అన్ని దేశాలూ చెప్పుకుంటున్నా... భయం మాత్రం అలాగే ఉంటోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ అలర్ట్ ఉంది. ముఖ్యంగా ఎయిర్‌పోర్టుల దగ్గర ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. హైదరాబాద్... శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. హాంగ్ కాంగ్ నుంచి వచ్చే ప్రయాణికులను టెస్ట్ చేసేందుకు ప్రత్యేక స్కానర్లు ఏర్పాటు చేశారు. మూడు రోజులుగా హాంగ్‌కాంగ్‌ నుంచి హైదరాబాద్‌కు విమానాలు తిరగలేదు. గురువారం అర్ధరాత్రి మాత్రం ఓ విమానం వచ్చింది. అందులో ప్రయాణికుల్ని టెస్ట్ చేసినట్లు తెలిసింది. చైనా, థాయ్‌లాండ్, హాంగ్‌కాంగ్‌, దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధి వల్ల చైనాలో 17 మంది చనిపోయారు. మొత్తం 444 మందికి వైరస్‌ అంటుకున్నట్లు గుర్తించారు. జపాన్‌, కొరియాల్లో ఒక్కొక్కరికీ, థాయ్‌లాండ్‌లో ముగ్గురికి సోకింది. అమెరికాలోని సియాటిల్‌లో ఒకరికి వచ్చింది. అందుకే తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం ఎక్కువగా అలర్టయ్యాయి. విమానాల్లో ప్రయాణికులు దిగగానే... వాళ్లను తిన్నగా టెస్టింగ్ సెంటర్‌లోకి పంపుతున్నారు. అక్కడ ఫుల్లుగా స్కాన్ చేసి... ఓకే... వైరస్ లేదు అనుకున్నాకే వెళ్లనిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా దగ్గు, జలుబు, జ్వరం, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తే... వారిని స్పెషల్‌గా టెస్ట్ చేస్తున్నారు. విషయం తేలకపోతే... ఆస్పత్రికి కూడా పంపిస్తున్నారు. ఇలా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading