హుబ్బళ్లి విశ్వనాథ ఆలయంలో పూజ చేసే సమయంలో ఓ మహిళ చీరకు నిప్పు అంటుకుంది. దీంతో.. ఆ పరిస్థితుల్లోనూ తనని నగ్నంగా ఎవరూ చూడొద్దని అక్కడే ఓ గదిలోకి వెళ్లిపోయింది. ఇది చూసిన స్థానికులు లోపలికి వెళ్లి మంటలార్పారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె పేరు ఛాయగా గుర్తించారు. ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.