కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పుల్వామా జిల్లా నర్బల్ గ్రామంలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. మిలిటెంట్ల కాల్పుల్లో ఓ మహిళ మరణించింది. మరో మైనర్ బాలుడికి గాయాలయ్యాయి. చనిపోయిన మహిళలను నజీనాగా గుర్తించారు. తీవ్ర బుల్లెట్ గాయాలతో ఆస్పత్రికి తరలించగా..అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా దళాలు, పోలీసులు కాకపోరా ప్రాంతంలో భారీగా మోహరించారు. పారిపోయిన టెర్రరిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.