HOME » VIDEOS » National

Video : కదులుతున్న రైలు దిగబోయి.. ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్యలో చిక్కుకున్న మహిళ

కదిలే రైలు నుంచి కిందకు దిగబోయిన ఓ మహిళ ప్రమాదవశాత్తు ప్లాట్‌ఫామ్‌కు-రైలుకు మధ్యలో ఇరుక్కుపోయింది. దీంతో ఆమెను బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు.మొదట రైల్వే అధికారులు ఆమెను బయటకు లాగేందుకు ప్రయత్నించినప్పటికీ.. వారి ప్రయత్నాలేవి సఫలం కాలేదు. అనంతరం ఫైర్ సిబ్బంది వచ్చి ప్లాట్‌ఫామ్‌ని బద్దలు కొట్టడంతో ఎట్టకేలకు ఆమె బయటపడింది. స్వల్ప గాయాలతో బయటపడింది. తమిళనాడులోని మధురైలో ఈ ఘటన జరిగింది.గాఢ నిద్రలో ఉన్న ఆమెకు.. రైలు మధురై స్టేషన్ నుంచి కదులుతుండగా మెలుకువ వచ్చింది.తాను దిగాల్సింది అదే స్టేషన్ కావడంతో హడావుడిగా రైలు దిగబోయి ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్యలో చిక్కుకుపోయింది.

webtech_news18

Top Stories