HOME » VIDEOS » National

Video : విధుల్లో చేరిన అభినందన్ వర్ధమాన్...

ఇండియా న్యూస్14:18 PM September 02, 2019

Abhinandan Varthaman : బాలకోట్ దాడుల్లో ధైర్యంగా పోరాడి... పాకిస్థాన్ సైన్యానికి చిక్కిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి విధుల్లో చేరారు. బాలకోట్ దాడుల తర్వాత తొలిసారిగా ఆయన మిగ్-21 విమానం నడిపారు. పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ నుంచీ దూసుకెళ్లిన ఆ యుద్ధ విమానంలో వర్ధమాన్‌తోపాటూ... ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా కూడా ఉన్నారు. వర్ధమాన్ నడిపినది ట్రైనర్ వెర్షన్‌కి చెందిన మిగ్ - 21 టైప్ 69 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్. ఐతే... ధనోవా... మిగ్-21 విమానానికి ఒకప్పుడు పైలట్‌గా ఉన్నారు. 1999 కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు ఆయన ఇలాంటి విమానాల్ని నడిపారు. యుద్ధ సమయంలో... 17వ స్క్వాడ్రన్‌కి ఆయన కమాండర్‌గా వ్యవహరించారు. ఇటీవలే భారత 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్‌కు ప్రభుత్వం వీరచక్ర పురస్కారాన్నిఅందజేసింది.

Krishna Kumar N

Top Stories