జార్ఖండ్‌లోని దేవఘర్లో ఉన్న కార్మెల్ స్కూల్... ఉన్నట్టుండి కుప్పకూలింది. లక్కీగా ఆ టైంలో స్కూల్ తెరచిలేదు. అందువల్ల ఎవరికీ ఏ గాయమూ కాలేదు. స్కూల్ తెరిచివుంటే గనక... తీవ్ర విషాదమయ్యేదే. నిజానికి స్కూల్ లో ఓ చోట పునర్నిర్మాణం జరుగుతోంది. ఇద్దరు కార్మికులు ఆ పనిలో ఉన్నారు. లక్కీగా వాళ్లు కూడా పనికి రాలేదు. భవనం కూలిపోవడంపై దర్యాప్తు జరపాలని స్థానికులు కోరుతున్నారు. స్కూల్ యాజమాన్యం మాత్రం దీనిపై స్పందించట్లేదు.