మన దేశంలోని మొత్తం ఆహారధాన్యాల వ్యవసాయంలో ఖరీఫ్ సాగు 70 శాతం ఉంటోంది. నైరుతి రుతుపవనాలు రాగానే... వరిసాగు ప్రారంభిస్తారు రైతులు. పంట చేతికి రావడానికి 120 రోజులు పడుతుంది. వర్షాలు ఆలస్యమైతే... పంట సాగు కూడా ఆలస్యమవుతుంది. అందువల్ల రైతులు... త్వరగా సాగు పూర్తయ్యే పంటలు వేస్తారు. నవంబర్లో పండే జొన్నలు ఇతరత్రా పంటలు వేస్తారు. ఇలాంటి పంటలు రైతులకు ఎక్కువ డబ్బు ఇవ్వవు. ఫలితంగా వాళ్ల అప్పులు తీరవు. భారత్లోని 80 రైతులు... చిన్న, సన్నకారు రైతులే. వర్షాలు ఆలస్యమైతే, దిగుబడి తగ్గి... ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. కరవు సమస్య కూడా తలెత్తుతుంది.