కాశ్మీర్ అంశంపై చర్చించాల్సింది ఏముందని అభిప్రాయపడ్డారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న ఆయన... 1954లో ఎన్నికలు జరిగినప్పటి నుంచీ... ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఎన్నికవుతున్నారని అన్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు అక్కడ నడిచాయన్నారు. అక్కడి నుంచీ ఎంపీలు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారనే వాస్తవాన్ని తెలిపారు. ఇంక చర్చించాల్సింది ఏముందని ఆయన ఎదురు ప్రశ్నించారు. చర్చించాల్సిందల్లా... పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌కి అప్పగించే అంశంపైనే అన్నారు వెంకయ్య నాయుడు.