HOME » VIDEOS » National

Video : మా భూమి... మా చరిత్ర... మళ్లీ మొదలైన ప్రత్యేక నాగాలాండ్‌ డిమాండ్...

ఇండియా న్యూస్14:54 PM February 17, 2019

మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన నాగాలాండ్‌... పేరుకి తగ్గట్టే నాగాలకు ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. అక్కడి 14 తెగలు, వాళ్ల ఆచారాలు, సంప్రదాయాలు పూర్తి భిన్నం. ప్రజల అధికార భాష ఇంగ్లీష్. బ్రిటీష్ వారి నుంచీ దేశం స్వాతంత్ర్యం పొందాక... నాగాలాండ్ ప్రజలు భారత్‌లో కలిసేందుకు ఇష్టపడలేదు. అప్పటి ప్రధాని నెహ్రూ... నాగాలాండ్‌ను ప్రత్యేక దేశంగా గుర్తించేందుకు ఒప్పుకోలేదు. 1963 డిసెంబర్ 1న నాగాలాండ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా (16వ రాష్ట్రం) ప్రకటించారు. అలా 70 ఏళ్లుగా నాగాలు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ఉన్నారు. ఐతే... నాగాలాండ్‌పై కేంద్రం ఏనాడూ పెత్తనం చెలాయించలేదు. దౌర్జన్యాలకు దిగలేదు. అసలు నియంతృత్వం అన్నదే లేదు. అంతెందుకు ఏటా నాగాలు జరిపే ప్రత్యేక ఉత్సవాలకు రాష్ట్రపతి, ప్రధానమంత్రిని ఆహ్వానిస్తారు కూడా. అయినప్పటికే దేశంలో భాగంగా ఉంటే... తమకు గుర్తింపు ఉండదంటున్న నాగాలు... తమను ప్రత్యేక దేశంగా గుర్తించి, సార్వభౌమత్వం కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయంలో ప్రధానమంత్రితో చర్చలకు సిద్ధమని ప్రకటించారు నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (NSCN) ప్రధాన కార్యదర్శి థుంగలెంగ్ ముయి‌వా. అసలు ఆయన ఏం కోరుతున్నారో న్యూస్ 18కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకుందాం.

Krishna Kumar N

Top Stories