హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ఉడిపి విశ్వేశ తీర్థ స్వామి శివైక్యం... ప్రముఖుల సంతాపం

జాతీయం12:54 PM December 29, 2019

Pejawar Shree Passes Away : కర్ణాటకలోని... ఉడిపిలో ఉన్న పెజావర్ మఠ పీఠాధిపతి విశ్వేశ తీర్థ స్వామి... 88 వయసులో శివైక్యం పొందారు. స్థానిక ఎమ్మెల్యే రఘుపతి భట్ ఈ విషయాన్ని ధృవీకరిస్తూ... డిప్యూటీ కమిషనర్‌తో కలిసి భక్తులకు ఈ విషాద వార్త తెలిపారు. ఆయన మరణ వార్త విని దేశ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమత్రి అమిత్ షా సహా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. డిసెంబర్ 20న స్వామి సరిగా ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతుంటే... మంగళూరులోని... కస్తూర్బా మెడికల్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వెంటిలేటర్‌పై ఉంచారు. అప్పటి నుంచీ స్వామికి అనారోగ్య సమస్యలు కొనసాగాయి. నేటి ఉదయం స్వామి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన బ్రెయిన్ పనిచేయడం మానేసిందని డాక్టర్లు తెలిపారు. అలా స్వామి ఆదివారం ఉదయం శివైక్యం పొందారు. స్వామిని భక్తులు కడసారి చూసేందుకు... ఆయన పార్థీవ దేహాన్ని అజ్జార్కడ్ గ్రౌండ్స్ దగ్గర ఉదయం 10 గంటల నుంచీ మధ్యాహ్నం 1 గంట వరకూ ఉంచుతున్నారు. ఆ తర్వాత బెంగళూరుకు హెలికాఫ్టర్‌లో తరలిస్తారు. అక్కడి నేషనల్ కాలేజీ గ్రౌండ్‌లో అంత్యక్రియలు జరగనున్నాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading