హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.చాలాచోట్ల గ్రామాలకు పట్టణాలతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అత్యవసర వైద్య సేవల కోసం వేరే పట్టణాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఓ వృద్దుడిని గ్రామస్తులు భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లారు. గ్రామంలోని వాంగు పొంగడంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది.దీంతో వృద్దుడిని భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లారు.