హోమ్ » వీడియోలు » జాతీయం

Video: మాది బాధ్యతాయుతమైన మేనిఫెస్టో: నరేంద్ర మోదీ

జాతీయం10:42 AM April 09, 2019

భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీకి చెందినదని న్యూస్‌18 ఇంటర్వ్యూలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశ పాలనను కొనసాగించే దిశగా తమ మేనిఫెస్టో ఉందన్నారు. మొదటిసారి తమ మేనిఫెస్టోలో 2022, 2024 నాటికి వేర్వేరుగా రోడ్‌మ్యాప్స్ రూపొందించామని చెప్పారు. దీనర్థం కేవలం ఐదేళ్లకు మాత్రమే కాదు... అంతలోపే తమ ప్రణాళికలు ఉన్నాయన్నారు. గతంలో ఏ పార్టీ ఇలా చేయలేదని మోదీ చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లలో సాధించాల్సినవాటి కోసం మేము 75 అడుగుల్ని మేనిఫెస్టోలో వివరించామని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ.

webtech_news18