పాకిస్తాన్ అదుపులో ఉన్న భారత వైమానిక వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాక్ నేడు విడుదల చేయనుంది. పంజాబ్‌లోని వాఘా సరిహద్దు వద్ద పాక్ ఆయన్ను భారత్‌కు అప్పగించనుంది. ఈ నేపథ్యంలో అభినందన్ రాక కోసం భారతీయులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఉదయం 6గంటల నుంచే వాఘా సరిహద్దు వద్దకు జనం చేరుకోవడం మొదలైంది. భారత్‌తో అన్ని రకాల ఫార్మాలిటీస్ పూర్తయ్యాక పాక్ అభినందన్‌ను మన దేశానికి అప్పగించనుంది.