భారత్ పర్యటన తమకెంతో ప్రత్యేకమైనదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రధాని మోదీతో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తీవ్రవాదాన్ని అణిచివేసేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. తన పర్యటన రెండు దేశాలకు ఉపయోగకరమైనదని ట్రంప్ అన్నారు సహజవాయువు రంగంలో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం ఉంటుందని అన్నారు. భారత్తో ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని వివరించారు. రక్షణ రంగంలో 3 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరిందని... అపాచీ, రోమియో హెలికాప్టర్ల కొనుగోలు కు ఒప్పందం కుదిరింది. భారతీయుల ఆదరాభిమానాలు వెలకట్టలేనివని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.