పౌరసత్వ సవరణ చట్టం (CAA), ఢిల్లీలో తాజా హింసాత్మక ఘటనలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. భారత్ పర్యటనపై మాట్లాడిన ఆయన..CAA అంశంపై మోదీతో చర్చించలేదని తెలిపారు. భారత్లో మతపరమైన స్వేచ్ఛకు నరేంద్ర మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. దేశంలో జరుగుతున్న కొన్ని హింసాత్మక ఘటనలు భారత్ అంతర్గత విషయమని చెప్పారు డోనాల్డ్ ట్రంప్. ఇక మోదీ మాటల్లోనే కాదు.. చేతల్లోనూ ధృడంగా ఉంటారని ప్రశంసించారు.