Donald Trump Visit to India | నమస్తే ట్రంప్ ప్రోగ్రాం సందర్భంగా గుజరాత్‌లోని మోతెరా స్టేడియంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం తర్వాత మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు మన దేశం సాధిస్తున్న ప్రగతిపై ప్రశంసల ఝల్లులు కురిపించాడు. ఈ సందర్భంగా ఆయన మోదీని కొనియాడారు. మోదీ.... గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా అంటూ ప్రశంసించారు. విభిన్న భాషల సమ్మెళనం ఇండియా అని, సంస్కృతి, సంప్రదాయాలకు భారత్ పెద్దపీట వేస్తోందని కొనియాడారు. భారత్‌లో సచిన్, విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ప్లేయర్లు ఉన్నారన్నారు. భారతీయ సినిమాలను ప్రపంచం ఇష్టపడుతోందని, భారత్ ఏడాదికి 2 వేల సినిమాలు నిర్మిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. డీడీఎల్‌జే సినిమాను ఆయన ప్రస్తావించారు.