HOME » VIDEOS » National » UP KACHORI SELLER EARNS OVER 60 LAKH ANNUALLY AND GETS TAX NOTICE SR

సమోసాలు అమ్ముకునే వ్యక్తి ఆదాయం చూసి.. షాక్ తిన్న అధికారులు..

జాతీయం19:18 PM June 25, 2019

అది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలీఘర్ ప్రాంతంలో ఉన్న సీమా సినిమా థియేటర్ ప్రాంతం. థియేటర్ పక్కనే ముఖేష్ అనే చిరు వ్యాపారి నిర్వహిస్తున్న చిన్న సమోసా-కచోరీ షాప్. షాప్ చిన్నదే కానీ.. థియేటర్ ముందు కూడా లేనంత క్యూ లైన్ ఇక్కడ ఉంటుంది. ఆ షాప్‌లో దొరికే సమోసా-కచోరీకి లోకల్‌గా అంత పాపులారిటీ ఉంది. ఎంత పాపులారిటీ అంటే.. ఏడాదికి రూ.60లక్షలు నుంచి రూ.1కోటి సంపాదించేంత. నమ్మాలనిపించడం లేదు కదా.. కానీ ఇది నిజం. ముఖేష్ సంపాదన అంచనా వేసి.. ఇటీవలే ఎవరో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌వాళ్లకు ఫిర్యాదు కూడా చేశారు. ముఖేష్ ఆదాయం ఎంత లేదన్నా ఏడాదికి రూ.60లక్షలు నుంచి రూ.1కోటి ఉంటుందని అంచనా వేశారు.అప్పటికప్పుడు ముఖేష్‌కు నోటీసులు జారీ చేసి ట్యాక్స్ కట్టాలని చెప్పారు. జీఎస్టీ కింద షాప్‌ను రిజిస్టర్ చేయించుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఈ వ్యవహారంపై స్పందించిన స్టేట్ ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్.. ముఖేష్ తన ఆదాయానికి సంబంధించిన వివరాలన్నింటిని ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలిపారు.

webtech_news18

Top Stories