మహారాష్ట్రలోని నాసిక్.. తారావాలా నగర్ చౌక్ వద్ద బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తూ బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనతో షాక్ తిన్న డ్రైవర్ ట్రక్‌ను అక్కడే వదిలేసి.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఈ ఘటన సంబందించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో వైరల్‌గా మారింది.