ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో నిలిపి ఉన్న రైలుకు నిప్పంటుకుంది. చివరి బోగీలో మంటలు చెలరేగడంతో స్టేషన్ అధికారులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో రైలు ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది.