Chennai Water Crisis: చెన్నై నీటి సంక్షోభం ఎంతలా భాదించిందో తెలిసిందే. గుక్కెడు నీళ్ల కోసం చెన్నై వాసులు విలపించారు. నీటి కోసం చెన్నై నగరం మునుపెన్నడూ విధంగా దయనీయమైన పరిస్థితిని ఎదుర్కోంది. చైన్నై నగరానికి నీళ్లందిచే రిజర్వాయర్లు పూర్తిగా అడుగంటిపోయాయి. మీటర్ల కొద్ది తవ్విన బోర్లు ఎండిపోయాయి. కనీస అవసరాలైన కాలకృత్యాలు తీర్చుకుందామన్నా.. నీళ్లు దొరకని పరిస్థితి. అంతలా భాదించింది చెన్నై నీటి సంక్షోభం. అయితే దీన్ని అప్పటికప్పుడు ఎదుర్కోవడానికి అధికారులు ఇతర ప్రాంతాల నుండి నీటిని రైల్లలో తరలించారు. అలా కొంతలో కొంతైనా చైన్నై వాసుల అవసరాలను తీర్చామంటున్నారు అధికారులు.