మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీపంలోని చోర్బహులి దగ్గర పెద్దపులి రోడ్డుపైకి వచ్చింది. జాతీయ రహదారి నెం.7 మీదుగా ప్రయాణిస్తున్న కొందరు... రోడ్డుపైకి పులి రాకను గమనించి కారు ఆపారు. రోడ్డుపైకి వచ్చిన పులి... రోడ్డు అవతలి వైపుకు వెళ్లిపోయింది. అయితే వన్యప్రాణాలు సంచరించే ప్రాంతాల్లో వాటికి ఎలాంటి రక్షణ లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.