విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్‌పై కొందరు యువకులు దాడికి తెగబడ్డారు. బైక్‌ని ఆపి లైసెన్స్ అడిగినందుకు అతడిని చితకబాదారు. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే దౌర్జన్యానికి దిగారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మహారాష్ట్రలోని థానెలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.