హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ప్రమాదంపై కమల్‌హాసన్ విచారం... బాధితులు కోలుకోవాలంటూ ట్వీట్

జాతీయం09:37 AM February 20, 2020

భారతీయుడు 2 సినిమా షూటింగ్‌లో క్రేన్ కింద పడిపోవడంతో... ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. మృతుల్లో ఒకరు 29 ఏళ్ల మధు (డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్)... మరొకరు 34 ఏళ్ల కృష్ణ (శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్) ఉన్నారు. 60 ఏళ్ల చంద్రన్... స్టాఫర్‌గా ఉన్నారు. మరో 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా భారతీయుడు 2. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర జరుగుతోంది. ప్రమాద ఘటనతో అంతా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. చెన్నై శివార్లలోనే ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులుగా జరుగుతోంది. ఇప్పుడు కూడా అక్కడే షూట్ చేస్తున్న సమయంలో భారీ క్రెయిన్ పడిపోయింది. పక్కనే కెమెరా డిపార్ట్‌మెంట్ దగ్గర శంకర్ ఉన్నాడు. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి దగ్గర్లోనే ఉన్న కమల్ హాసన్... గాయపడిన వాళ్లను హాస్పిటల్‌కు తరలించడంతో పాటు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఈ ప్రమాదం అత్యంత భయానకమైనదన్న కమల్ హాసన్... ముగ్గురు కొలీగ్స్‌ని కోల్పోయానంటూ ట్వీట్ చేశాడు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలిపాడు. వారితో కలిసి బాధను పంచుకుంటానన్నాడు. గాయపడిన వారికి ఎలా ఉండో డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నాడు కమల్ హాసన్. ప్రాథమిక చికిత్స తర్వాత... అసలైన ట్రీట్‌మెంట్ జరుగుతోందని ట్వీట్ ద్వారా తన అభిమానులకు తెలిపాడు. త్వరలోనే గాయపడినవారు కోలుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపాడు. కొన్ని రోజులుగా కమల్ రాజకీయాలతో పాటు భారతీయుడు 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. 2.0 సినిమా తర్వాత భారీ బడ్జెట్‌తో కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇందులో కాజల్, రకుల్ హీరోయిన్లు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ మొదలైంది. 30 శాతం పూర్తయింది కూడా. మేజర్ షెడ్యూల్స్ అన్నీ చెన్నై, రాజమండ్రి, హైదరాబాద్‌, రాజస్థాన్‌ లాంటి ప్రదేశాల్లో చిత్రీకరించాడు దర్శకుడు శంకర్. దాంతో పాటు మరిన్ని కీలకమైన షెడ్యూల్స్ కోసం మార్చ్, ఎప్రిల్‌లో చైనా, థాయ్‌లాండ్‌ ప్లాన్ చేశాడు. ఆ లోపే ఈ భారీ ప్రమాదం జరిగింది.

webtech_news18