తమిళనాడులో ప్రభుత్వం లేదని, ఇక్కడ అంతా రిమోట్ పాలన నడుస్తోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. స్టాలిన్‌తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆ సమాధానం ఇచ్చారు. కూటమికి తాను నాయకుడిని కాదని, అందర్నీ కలిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అంతా కుదిరిన తర్వాత పీఎం అభ్యర్థి గురించి ఆలోచిస్తామన్నారు.