Puri Rath Yatra Festival 2019 : ఒడిషా లోని పూరీ క్షేత్రంలో జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా గురువారం ఉదయం ప్రారంభమైంది. తొమ్మిది గంటలకు సంప్రదాయబద్ధంగా మూల విరాట్ల తరలింపు కార్యక్రమం చేపట్టారు. సుదర్శనుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుని మూల విరాట్లు వరుస క్రమంలో రథాలపైకి చేరిన తర్వాత రథయాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర సూర్యాస్తమయం వరకు నిరవధికంగా కొనసాగుతుంది.
జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రధాన దేవస్థానం శ్రీ మందిరం పుష్పాలంకరణతో ఆకట్టుకుంటోంది. ఆలయ చరిత్రలో రథయాత్ర సందర్భంగా ఆలయాన్ని పుష్పాలతో అలంకరించడం ఇదే మొదటిసారి. స్వామి రథయాత్ర సందర్భంగా అశేష భక్త జనంతో పాటు రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ కూడ తరలివచ్చారు.