Haritha haram in parliament house : పార్లమెంట్ భవనం వద్ద టీఆర్ ఎస్ లోక్ సభ పక్ష నాయకులు నామా నాగేశ్వర రావు హరితహారం చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ పథకం హరితహారాన్ని చెపడుతూ.. ఉత్సాహంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్, రాజ్యసభ ఎంపీలు కే కేశవరావు, సంతోష్ రావు, బండ ప్రకాశ్ ముదిరాజ్ పాల్గొన్నారు. హరితహారం కింద మొక్కలు నాటిన నామా నాగేశ్వరరావును కేంద్ర మంత్రి, ఎంపీలు అభినందించారు.