కరుణానిధికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించారు. రాజాజీ హాలు వద్ద కరుణానిధి భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఇచ్చి నివాళులు అర్పించారు. కేసీఆర్ వెంట ఆయన కుమార్తె, నిజామాబాద్ ఎంపీ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరావు తదితరులు ఉన్నారు. అంతకుముందు కరుణానిధి కుమారుడు స్టాలిన్ను కలిసిన సీఎం కేసీఆర్, ఆయన్ని ఓదార్చారు.