హోమ్ » వీడియోలు » జాతీయం

Video : భోజనానికి గ్లాస్ నీళ్లే... చెన్నైలో అత్యంత తీవ్రంగా నీటి కొరత...

జాతీయం13:58 PM June 17, 2019

Chennai Water Scarcity : తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో తాగునీటి కొరత బాగా పెరిగిపోయింది. 20 లీటర్ల క్యాన్‌ను రూ.40 రూపాయలు పెట్టి కొంటున్నారు. వర్షాలు పడకపోవడంతో... ఆ రాష్ట్రంలో డ్యాములు, రిజర్వాయర్లూ పూర్తిగా ఎండిపోయాయి. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయాయి. నీరు లేక చాలా ఆఫీసులు, హోటళ్లు క్లోజ్ అయ్యాయి. కొన్ని హోటళ్లు నీరు లేక భోజనాల సెక్షన్ తీసేశాయి. మరికొన్ని ఒక భోజనానికి ఒక గ్లాస్ నీళ్లే ఇస్తామనే కండీషన్ పెట్టాయి. ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగులకు నీళ్లు అందించలేక నానా తిప్పలు పడుతున్నాయి. ఇక రైతుల సమస్యలు ఉండనే ఉన్నాయి. బోర్లలో నీరు రావటలేదు. పొలాలు ఎండిపోయాయి. కొత్తగా సాగు చేసే పరిస్థితి లేదు. ఒక్క బిందె నీటి కోసం చెన్నైలో మహిళలు గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. నిద్రపోయే పరిస్థితి కూడా లేదు. జాగారం చేసి మరీ బిందెడు నీళ్లు సంపాదించుకోవాల్సి వస్తోంది. నీటి కారణంగా చెన్నైలో చాలా పనులు పెండింగ్‌లో పడిపోతున్నాయి. ట్యాంకర్ల నీటిని కొనుక్కుందామన్నా... వాటి రేటూ పెంచేశారు. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురిపించాలి. ఈసారి అలా జరగకపోవడంతో సమస్య మరింత జఠిలమైంది. రోజువారీ అవసరాలకు ప్రజలు 6 వేల లీటర్ల ట్యాంకరుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు చెల్లిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా మారిపోయిందో గ్రహించవచ్చు.

Krishna Kumar N