హోమ్ » వీడియోలు » జాతీయం

వానల కోసం యజ్ఞాలు చేస్తోన్న తమిళనాడు మంత్రులు

జాతీయం14:00 PM June 22, 2019

గుక్కెడు నీళ్ల కోసం చెన్నై విలపిస్తోంది.. నీటి సంక్షోభంతో మునుపెన్నడూ లేని దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటోంది. రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటిపోయాయి.. బోర్లు ఎండిపోయాయి.. కాలకృత్యాలు తీర్చుకుందామన్నా ఎక్కడా నీళ్లు దొరకట్లేదు. వంటలకు నీళ్లు లేక హోటల్స్ మూతపడుతున్నాయి. హాస్టల్స్, పీజీలు వాటర్ సప్లై తమ వల్ల కాదని చేతులెత్తేశాయి. కొన్ని హాస్టల్స్‌లో కేవలం ఒక గంట పాటు మాత్రమే నీటిని సప్లై చేస్తున్నారు. ఈ నీటి సంక్షోభం నుండి బయటపడడానికి తమిళనాడు మంత్రులు దేవుళ్ళకు యజ్ఞాలు, పూజలు చేస్తున్నారు. తమిళనాడు మంత్రి SP వేలుమణి కోయంబత్తూరులోని పట్టీశ్వరర్ దేవాలయంలో పూజలు నిర్వహిస్తే.. చెన్నైలోని అరుల్‌మిగు గంగాధీశ్వరర్ దేవాలయంలో మంత్రి D. జయకుమార్ పూజలు నిర్వహించారు.

webtech_news18