బెంగళూరులో గ్రేనేడ్ కలకలం సృష్టిస్తోంది. అనుమానస్పద రీతిలో ఓ దేశీ గ్రెనేడ్ కనపడడంతో.. ఈరోజు ఉదయం బెంగళూరులోని KSR రైల్వే స్టేషన్ పోలీసులకు ఫోన్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు స్టేషన్‌ను అదుపులోకి తీసుకొని..జాగిలాలతో మొత్తం స్టేషన్ జల్లెడ పట్టారు. ఆ తర్వాత పోలీసులు మాట్లాడుతూ అదీ దేశీ గ్రెనేడ్ అని..ప్రస్తుతం ఆ గ్రెనేడ్ క్రీయాశీలంగా లేదని..దాంతో అపాయం ఉండదని తెలిపారు. ఆ గ్రెనేడ్‌ను అక్కడినుండి తొలగించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు.