హోమ్ » వీడియోలు » జాతీయం

Video : సూరత్ అగ్నిప్రమాదం : బిల్డర్లపై హత్య కేసు నమోదు...

జాతీయం12:05 PM May 25, 2019

Surat Fire Accident : గుజరాత్‌... సూరత్‌లోని తక్షశిల కాంప్లెక్స్‌లోని కోచింగ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో ఆ భవనాన్ని నిర్మించిన ఇద్దరు బిల్డర్లు హర్షల్ వికారియా, జిగ్నేష్‌పై హత్య కేసు నమోదైంది. మూడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి, ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకి మరికొందరు ఇలా మొత్తం 20 మంది విద్యార్థులు చనిపోయారు. గాయపడిన కొందరకి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. దీనంతటికీ కారణం... ఆ భవనానికి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఒకటే ఉండటమే. పై అంతస్థులకు వెళ్లేందుకు చెక్కలతో చేసిన మెట్ల మార్గం మాత్రమే ఉంది. అగ్ని ప్రమాదంలో చెక్కమెట్లు తగలబడటంతో విద్యార్థులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ భవనంలో కోచింగ్ క్లాసులు చెబుతున్న క్లాస్ ఆపరేటర్ భార్గవ్ బుటానీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో దేశం మొత్తాన్నీ కదిలించింది. సోషల్ మీడియాలో అది వైరల్ అయ్యింది. ఆ వీడియోలో ప్రాణాలతో బయటపడేందుకు విద్యార్థులు భవనం పై నుంచీ కిందకు దూకేస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేశాయి.

Krishna Kumar N

Top Stories

corona virus btn
corona virus btn
Loading