దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఢిల్లీ అల్లర్ల గురించి చర్చ జరుగుతుంది. అక్కడ జరిగిన అల్లర్లలో 22 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు తెలిసి అంతా కలద చెందుతున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఈ ఘటనపై మనసులో మాట చెబుతున్నారు. కొందరు సినిమా ప్రముఖులు కూడా ఈ విషయంపై మాట్లాడుతున్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఈ అల్లర్లకు కేంద్రప్రభుత్వాన్ని తప్పు పట్టాడు. వాళ్ల వైఖరిపై తమిళ సూపర్ స్టార్ మండి పడ్డాడు. పౌరసత్వ సవరణ చట్టంతో ముస్లింలకు నష్టం కలిగితే.. గతంలో చెప్పినట్లుగానే తాను వాళ్ల వెంట నడుస్తానని మరోసారి స్పష్టం చేసాడు రజనీకాంత్. ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లు ముమ్మాటికి కేంద్రప్రభుత్వం నిఘా వైఫల్యమే అని ఆయన విమర్శించాడు. ఈ విషయంలో కేంద్రం తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని రజనీ తెలిపారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న ఈయన.. అప్పుడప్పుడూ ఇలా ప్రజాసమస్యలపై కూడా మాట్లాడుతున్నాడు. రజినీ మాటలను పలువురు రాజకీయ నేతలు కూడా సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం విషయం తెలియకుండా అజ్ఞానంతో మాట్లాడుతున్నాడంటూ విమర్శిస్తున్నారు.