కన్నడ సినీ, రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన అంబరీష్ కన్నుమూశారు. 66ఏళ్ల వయసులో అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. అంబరీష్ మరణంతో ఆయన కుటుంబం, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అంబరీష్ పార్థివ దేహం వద్ద ఆయన భార్య సుమలత కన్నీరుమున్నీరుగా విలపించారు.