హోమ్ » వీడియోలు » జాతీయం

Video : కదులుతున్న బస్సుపై ఎక్కి విద్యార్థుల హల్‌చల్..

జాతీయం12:15 PM June 18, 2019

చెన్నైలోని కాలేజీల్లో బస్సు డే వేడుకల సందర్భంగా విద్యార్థులు బస్సుల పైకి ఎక్కి ప్రమాదకర విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు.అది ప్రమాదమని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా వారి వైఖరిలో మార్పు రావడం లేదు.తాజాగా చెన్నైలోని పచ్చయప్పా కాలేజీకి చెందిన విద్యార్థులు కూడా అదే పని చేశారు. దాదాపు 50మంది విద్యార్థులు కాలేజీ బస్సు పైకి ఎక్కి బస్సు డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కదులుతున్న బస్సుపైనే విన్యాసాలు చేశారు. ఈ క్రమంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో చాలామంది కిందపడిపోయారు. వీరిలో పలువురు గాయాలపాలయ్యారు. నలుగురు విద్యార్థులను పోలీసులుఅదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

webtech_news18