HOME » VIDEOS » National » STRONG WINDS HIT THE REGION COASTAL OF GUJARAT AND SEA TURNS ROUGH SR

Cyclone Vayu : ఉధృతంగా వీస్తున్న గాలులు..భయానకంగా సముద్ర తీరం

జాతీయం13:25 PM June 13, 2019

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయు తుఫానుగా మారి... గుజరాత్ వైపు దూసుకెళ్తోంది. దీంతో గుజరాత్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రధాగంగా తుఫాను తీరం దాటేటప్పుడు గంటకు... 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పడంతో... ప్రభుత్వం అలర్టైంది. ఇప్పటికే కచ్, సౌరాష్ట్ర ప్రాంతం నుంచీ 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఈ ప్రాంతాలపై శుక్రవారం వరకూ... తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. వాయు తుఫాను మరింత తీవ్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వెరావల్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తుఫాను... మధ్యాహ్నం వెరావల్, దక్షిణ ద్వారక మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే అక్కడ అలలు అత్యంత ఎత్తున లేస్తున్నాయి.

webtech_news18

Top Stories