అనంతపురంలో కంటి వెలుగు పథకం ప్రారంభోత్సవ సభలో తోపులాట జరిగింది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక జగన్ తొలిసారి జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యలో ఆయన్ను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. ఐతే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటుచేసిన సభా ప్రాంగణంలో స్థలం సరిపోదంటూ పోలీసులు అడ్డుకున్నారు. వారిని సభా ప్రాంగణం బయటే నిలిపివేసి.. అనంతరం ఒక్కసారిగా గేట్లు తెరవడంతో లోపలిలికి వెళ్లేందుకు జనం పోటీపడ్డారు. ఈ క్రమంలో అక్కడ తోపులాట జరిగింది.