జమ్ముకశ్మీర్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో శ్రీనగర్ నిట్లో చదువుతున్న 31 మంది తెలుగు విద్యార్థులుఇంటి బాట పట్టారు. జమ్ము నుంచి శనివారం అర్ధరాత్రి 12 గంటలకు అండమాన్ ఎక్స్ప్రెస్లో బయలుదేరిన వీరికి దిల్లీలోని ఏపీ భవన్ అధికారులు మధ్యాహ్న భోజనాలు అందించారు. వీరితో పాటు మరో 90 మంది విద్యార్థులు కూడా ఈరోజు జమ్ము నుండి తెలుగు రాష్ట్రాలకు బయల్దేరారు.