హోమ్ » వీడియోలు » జాతీయం

పేలిన దుబాయ్-జైపూర్ స్పైస్‌జెట్ విమానం టైరు..

జాతీయం15:50 PM June 12, 2019

స్పైస్‌జెట్ విమానంకు ఘోర విమాన ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే స్పైస్ జెట్ విమానం టైర్ పగిలిపోయింది. అయితే, అప్రమత్తమైన పైలట్ విమానాన్ని సురక్షితంగా దించడంతో పెను ప్రమాదం నుంచి 189 మంది ప్రయాణికులు తప్పించుకున్నారు. వివరాల్లోకెళితే.. దుబాయ్-జైపూర్ ఎస్ జీ 58 విమానం ప్రయాణికులతో బయలుదేరింది. ఇవాళ ఉదయం 9.30 నిమిషాల సమయంలో టేకాఫ్ అయిన వెంటనే టైర్ పేలిపోయింది. అయితే, విమానం అలాగే ప్రయాణించింది. జైపూర్‌కు చేరుకోగానే అధికారుల సూచన మేరకు విమానాన్ని చాకచక్యంగా ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశారు. పైలట్ అప్రమత్తంగా ఉండటంతో ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగానే ఉన్నారు.

webtech_news18