దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు మరోసారి థానేలో షెత్ హాఫ్ మారథాన్ జరిగింది. ఈ వీల్ చైర్ రేస్‌లో ముంబైలోని క్రికెట్, టెన్నిస్, బాస్కెట్ బాల్ ప్లేయర్లు కూడా పాల్గొన్నారు. మహారాష్ట్రలోని 2 వేల మంది... 21 కిలోమీటర్ల రన్లో పాల్గొన్నారు. గతేడాది కంటే రిజిస్ట్రేషన్ల సంఖ్య 30 శాతం పెరిగింది. నినా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ... వెన్నెముక సమస్యలతో బాధపడేవారు ఈ మారథాన్‌లో పాల్గొనేందుకు వీలు కల్పిస్తోంది.