హోమ్ » వీడియోలు » జాతీయం

Video : ప్రధాని మోదీకి షారుక్ ఖాన్ కృతజ్ఞతలు

జాతీయం08:32 AM October 20, 2019

#ChangeWithin : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా తమను కలవడం ఎంతో ఆనందం కలిగించిందని తెలిపాడు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్. బాలీవుడ్ ప్రముఖులందర్నీ పిలిచి... ఓ కార్యక్రమం నిర్వహించి... తమతో చర్చించడం మంచి సందేశం ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందని ఖాన్... ట్వీట్ ద్వారా తెలిపాడు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్ముడి ఆలోచనలను, సినిమాలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సినీ పరిశ్రమకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. #ChangeWithin పేరుతో ఢిల్లీలోని లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లో జరిగిన కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు అమీర్‌ఖాన్‌, షారూక్‌ ఖాన్‌లతో పాటు చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలను విస్తృతం చేయడంలో సినీ, టీవీ పరిశ్రమకు చెందిన కొందరు సభ్యులు గొప్పగా పనిచేస్తున్నారన్న మోదీ... గాంధీ సిద్ధాంతాలను, అనుసరించిన మార్గాలనూ వివరించారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ నిషేధం నిర్ణయానికి మద్దతు తెలిపినందుకు అమీర్‌ఖాన్‌కు థాంక్స్ చెప్పారు. అదే సమయంలో... మహాత్మాగాంధీ సిద్ధాంతాల్ని ప్రజలకు తెలియజేసేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కృషిని అమీర్‌ఖాన్‌ అభినందించారు. ఇకపై సినిమాల్లో గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాల్ని కూడా ప్రచారం చేస్తామని షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ హామీ ఇచ్చారు. ఇలాంటి అవకాశాన్ని తాము వినియోగించుకుంటామని, బాలీవుడ్ సినిమాని ప్రపంచవ్యాప్తం చేస్తామని షారూఖ్ అన్నారు.

webtech_news18