ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో బిహార్ తడిసిముద్దైంది. వరద తాకిడితో పలు ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తం కాగా, 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. సహాయ పునరావాస చర్యలు చేపట్టేందుకు 32 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. బిహార్ రాజధాని పట్నాలో వరద నీటిలో చిక్కుకున్న దాదాపు 235 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. భారీ వర్షాలతో పలు ప్రాంతాలు నీట మునగడంతో పట్నాలోని అన్ని స్కూళ్లు, కాలేజీలను అక్టోబర్ 1 వరకూ మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.