Ayodhya Verdict: అయోధ్య కేసుపై ఇవాళ ఫైనల్ తీర్పు రాబోతోంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సారధ్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నేడు ఉదయం 10.30కు ఫైనల్ తీర్పు ఇవ్వబోతోంది. తీర్పు ఎలా ఉన్నా అందరూ సంయమనం పాటించాలని ప్రధాని మోదీ పిలుపిచ్చారు. అదే క్రమంలో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ కొనసాగుతోంది. తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు.